LSG Vs RCB: కొన్ని రోజుల క్రితం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ మరియు లక్నో సూపర్‌ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో లక్నో గెలిచిన సందర్భంగా గంభీర్‌ నోటి మీద వేలు వేసుకుని నోరు మూసుకుని వెళ్లండి అన్నట్లుగా సైగ చేశాడు. ఆ వివాదం నిన్నటి మ్యాచ్ లో తీవ్ర ప్రభావం చూపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోసారి ఆర్సీబీ మరియు లక్నో మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా రెండు జట్లు క్రికెట్‌ ఆడుతున్నట్లుగా కాకుండా యుద్దంలో పాల్గొంటున్నట్లుగా వ్యవహరించారు. ప్రతి వికెట్ కు.. బౌండరీకి రెండు జట్ల వారు కాస్త అతిగా ప్రవర్తించడం చూడవచ్చు. కోహ్లీ తన సీనియార్టీని కూడా పక్కన పెట్టి ప్రతి సెలబ్రేషన్ ను కూడా పది రెట్లు ఎక్కువ చేసుకోవడం జరిగింది. ఆ వివాదం చివరకు కొట్టుకునే వరకు వచ్చింది. 


లక్నో బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో 17వ ఓవర్‌ లో ఫేసర్ నవీన్ ఉల్‌ హక్‌, కోహ్లీ మధ్య చిన్నపాటి మాటల యుద్దం జరిగింది. దాన్ని వెంటనే అంపైర్ రంగ ప్రవేశం చేసి ఇద్దరి మధ్య గొడవ లేకుండా చేశారు. ఆ సమయంలో గొడవ సమసినట్లుగా అనిపించినా కూడా ఆతర్వాత కూడా కంటిన్యూ అయి్యింది. మ్యాచ్‌ పూర్తి అయిన తర్వాత ఫార్మాల్టీకి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చే పద్దతి ఉంటుంది. 



ఆ సమయంలో మళ్లీ కోహ్లీ తో కాస్త దుడుకుగా నవీన్ ఉల్ హక్‌ వ్యవహరించాడు. దాంతో ఇద్దరి మధ్య మాటల యుద్దం మరోసారి సాగింది. ఆ సమయంలో జట్టు సభ్యులు అంతా కూడా ఉన్నారు. దాంతో గొడవ కాస్త ఇంకాస్త పెద్దగా అయ్యింది. ఆ క్రమంలోనే గొడవలోకి గంభీర్‌ ఎంట్రీ ఇచ్చాడు.. అప్పుడు కోహ్లీ మరియు గంభీర్‌ ల మధ్య కాస్త సీరియస్ గానే మాటల యుద్దం జరిగింది. 


Also Read: OTT Theatre Movie : ఈ వారం ఓటీటీ థియేటర్ సినిమాల లిస్ట్ ఇదే.. గోపీచంద్, అల్లరి నరేష్‌ల సందడి


గ్రౌండ్ లో ఉన్న సమయంలో గెలుపు ఓటముల విషయంలో మానసిక పరిస్థితి అస్సలు బాగుండదు కనుక ఆ సమయంలో అనే మాటలను పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. కానీ గ్రౌండ్‌ లో లేని సమయంలో కూడా అత్యుత్సాహంను ప్రదర్శించడం అస్సలు పద్దతి కాదు. లక్నో జట్టు కెప్టెన్‌ వెళ్లి కోహ్లీతో బౌండరీ లైన్ వద్ద మాట్లాడుతూ ఉన్న సమయంలో నవీన్‌ ఉల్‌ హక్‌ ను పిలిచి కోహ్లీకి క్షమాపణ చెప్పాలంటూ సూచించాడు. 


అప్పుడు నవీన్ ఏమాత్రం పట్టించుకోకుండా.. సీనియర్ అయిన కోహ్లీ కి కనీస గౌరవం ఇవ్వకుండా తల పొగరుగా నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్లుగా తల తిప్పుకుంటూ వెళ్లడం జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియా లో వైరల్‌ అవుతోంది. ఈ గొడవకు కారనం vఅయిన ప్రతి ఒక్కరికి కూడా రిఫరీ మ్యాచ్ ఫీజ్ లో కోత విధిస్తున్నట్లుగా ప్రకటించారు. అంతే కాకుండా ప్రత్యేకంగా కౌన్సిలింగ్‌ ఇవ్వబోతున్నట్లుగా కూడా పేర్కొన్నారు. 


Also Read: Minister Harish Rao: 8 అంతస్తుల్లో నిమ్స్ నూతన భవనం.. త్వరలోనే భూమిపూజ: మంత్రి హరీష్‌ రావు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook